ముప్కాల్ మండల కేంద్రంలో
భారత్ పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 'స్వచ్ఛత పక్వాడ్-2024' జులై 1 నుంచి 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని
భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ముగింపు కార్యక్రమంను పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.