వేల్పూర్ అలాగే మోతే గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో PRTU సంఘం 2025 నూతన సంవత్సర క్యాలండర్ ను వేల్పూర్ మండల పీఆర్టీయూ టీఎస్ శాఖ పక్షాన క్యాలెండర్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దత్త ప్రసాద్, అన్వేష్ కుమార్, వివిధ పాఠశాల ఉపాధ్యాయుల బృందం, దేవా శ్రీనివాస్, రాములు, నాగరాజు పాల్గొన్నారు.