బోధన్: ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

52చూసినవారు
బోధన్: ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
బోధన్ పట్టణంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీలో బుధవారం డివిజన్ షీ టీమ్ విజయ్, గౌతమీలచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరు మహిళలపై జరిగే నేరాల గూర్చి, T-సేఫ్ యాప్, డయల్ 100, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, JJ చట్టం, సైబర్ నేరాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ వారి సిబ్బంది, కళాశాల ప్రధాన అధ్యాపకులు, అధ్యాపకులు, సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్