బోధన్ మండలం భవానిపేట్ గ్రామంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భవానిపేట్ గ్రామం వద్ద ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాకాసిపేట్ కు చెందిన తబితకు తీవ్ర గాయాలు కాగా.. జాడి గ్రామానికి చెందిన ఉదయరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని హుటాహుటిన బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, జావీద్ లు బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.