ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ పోస్టర్లను నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించారు. సోమవారం ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను అందించాలని కోరారు.