నవీపేట్ లో బైక్ ను లారీ ఢీకొనడంతో పకీరాబాద్ గ్రామానికి చెందిన దంపతులు మగ్గడి లక్ష్మణ్ (57), రాజమణి(50) అక్కడికక్కడే మృతి చెందారు. కూలి పనుల నిమిత్తం అబ్బాపూర్(ఎం) గ్రామానికి వెళ్లి రాత్రిపూట తిరిగి వస్తుండగా మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.