నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్రేశ్వర శివాలయం ఆవరణలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సార్వజనిక్ ఉత్సవ కమిటి 2024, 2025 సంవత్సరం కు సంబంధించిన మిగులు లక్షా యాభై రెండు వేల నాలుగు వందల రూపాయలను సార్వజనిక్ నిల్వ నిధి కమిటీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సార్వజనిక్ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.