బిచ్కుందకు చెందిన హన్మండ్లు(38)అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ. మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎస్ఐ మాట్లాడుతూ కాలకృత్యాలు కోసం వెళ్లి తిరిగి రాకపోవటంతో, అతని ఆచూకి గురించి వెతుకుతుంటే, బిచ్కుంద కమ్మరి చెరువులో చనిపోయి తేలుతూ కనిపించినట్లు అతని భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.