
సిద్దాపూర్ చెరువు కట్ట వద్ద విగతాజీవిగా కానిస్టేబుల్
పిట్లం మండలం సిద్దాపూర్ చెరువు కట్ట వద్ద పిట్లం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బుచ్చయ్య చారి శుక్రవారం ఉదయం విగతాజీవిగా కనిపించాడు. స్థానికులు గుర్తించి పిట్లం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా, పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న బుచ్చయ్యగా గుర్తించారు. బుచ్చయ్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.