కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గుండె నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారిగా నియమించారు. బుధవారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్య వ్యవస్థ పటిష్ట పరచడానికి ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూస్తానని అన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించాలని కోరారు.