డీఎస్పీపై సస్పెన్షన్‌ వేటు

78చూసినవారు
డీఎస్పీపై సస్పెన్షన్‌ వేటు
కామారెడ్డి జిల్లా క్రైం రికార్డ్ బ్రాంచ్ బ్యూరో డీఎస్పీపై సస్పెన్షన్ వేటు పడినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో డీఎస్పీగా పని చేసిన ఆయన తమ తనిఖీల్లో కిలో బంగారం దొరికిందని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి.. అతని వద్ద 20 లక్షలు తీసుకున్నట్టుగా సమాచారం. రోజులు గడుస్తున్నా కొద్దీ బంగారం, డబ్బులు ఇవ్వలేదు. డీఎస్పీ మధన్ లాల్ పై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం సదరు డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

సంబంధిత పోస్ట్