ప్రపంచ రేబిస్ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

72చూసినవారు
ప్రపంచ రేబిస్ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రేబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేబిస్ ప్రాణాంతక వ్యాధి అని, కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడగాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్