నవీపేట్: వరి కొనుగోలు కేంద్ర ఏర్పాటు కోసం వినతి
నవీపేట్ మండలంలోని బినోల సొసైటీ పరిధిలో వరి కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఆ సొసైటీ చైర్మన్ మగ్గరి హాండ్మాండ్లు, తహసీల్దార్ వెంకట రమణని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ప్రకటించటంతో రైతులందరూ కోసిన పంటలను సొసైటీ దగ్గర ఆరబెట్టుకుంటూ, కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.