నిజామాబాద్ - జాన్కంపేట్ మధ్య గల రైల్వే పట్టాలను బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి దాటుతుండగా రైలు ఢీ కొంది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని, మృతుడి వయస్సు 25 నుండి 30 ఏళ్ళ మధ్య ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.