ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి చెందినట్లు జక్రాన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన నడిపి గంగాధర్ సోమవారం ఇంట్లో మంచంపై పడుకుని బీడీ తాగుతుండగా బీడీకి ఉన్న నిప్పు రవ్వలు మంచంపై పడ్డాయి. దీంతో మంచం కాలిపోయి గంగారం తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.