ఖలీల్ వాడి లోని సమీకృత మార్కెట్, కళా భారతి నిర్మాణ పనులను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల శనివారం పరిశీలించారు. వీటి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గణేష్ బిగాల మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. నిజామాబాద్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమం లో అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.