ఉలిక్కి పడిన నిజామాబాద్.. ఒకే రోజు మూడు చోరీలు

75చూసినవారు
ఉలిక్కి పడిన నిజామాబాద్.. ఒకే రోజు మూడు చోరీలు
నిజామాబాద్ నాలుగో ఠాణా పరిధిలో ఒకే రోజు 3 చోరీలు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్వాగార్డెన్ వెనకాల రాఘవేంద్ర ఆపార్ట్‌మెంటు మూడో అంతస్తులో ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరేళ్లగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మూడు తులాల బంగారం చోరి జరిగింది. కాగా రుత్విక్ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో చోరీ జరిగింది. అలాగే ఆర్యనగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చొరబడ్డారు.

సంబంధిత పోస్ట్