నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నగర శివారులోని గూపన్ పల్లి శ్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పొలుసులు సమాచారమిచ్చారు. సౌత్ సీఐ సురేశ్, ఎస్ఐ ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.