నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఎల్ల వేళల బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ఏర్పట్టు చేసిన నాయి బ్రహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సమాజానికి నాయి బ్రహ్మణులు ఎంతో కీలకం అని అన్నారు. నిజామాబాద్ లో 2500 పై చిలుకు సెలూన్ లకు సబ్సిడీ ఇచ్చామని అన్నారు.