ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ చేయలేరని తేల్చి చెప్పింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని కొట్టిపారేసింది. ఈవీఎంలను హ్యాక్, ట్యాంపరింగ్ చేయొచ్చని ఓ వ్యక్తి చెబుతున్న వీడియో నెట్టింట వైరలవుతుండడంతో.. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరింది.