పేద విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం ‘పీఎం యశస్వీ’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 9 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు రూ.2లక్షల వరకు స్కాలర్ షిప్ పొందొచ్చు. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఈ స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే యశస్వి ప్రవేశ పరీక్ష రాసి పాస్ అయితే స్కాలర్‌షిప్ లభిస్తుంది.