మినపప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మినప పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మినపప్పుతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఎముకలను దృఢంగా మారుతాయి. రక్తహీనత, మలబద్ధకం దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్, ప్రోటిన్‌లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది.