10 ఏళ్లుగా నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్ సింగ్

80చూసినవారు
10 ఏళ్లుగా నాకు, ధోనీకి మధ్య మాటల్లేవు: హర్భజన్ సింగ్
తాను, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 10 ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం లేదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. "నాకు, ధోనీతో ఏ సమస్య లేదు. అతనే మాట్లాడటం లేదు. కారణాలేంటో తెలీదు. ధోనీ కెప్టెన్సీలో నేను సీఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం. అది కూడా మైదానం వరకే పరిమితం," అని హర్భజన్ చెప్పారు. సంబంధం అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్