నోరో వైరస్ బాధితుల్లో చాలామంది చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారు. కానీ ఇతర అనారోగ్యాలు ఉన్నవారికి వైద్య చికిత్స అవసరమవుతుంది. డీహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి, అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలి. సాధారణంగా లక్షణాలు రెండు నుంచి మూడు రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ 48 గంటల పాటు లక్షణాలు ఉన్నవారికి ఇంట్లోనే ఉండడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.