ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

74చూసినవారు
ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
శత్రుదేశాలపై కన్నేసేందుకు నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలనుకున్న నార్త్ కొరియాకు చుక్కెదురైంది. తాజాగా నిఘా ఉపగ్రహంతో ఓ రాకెట్ ను ప్రయోగించగా.. ఆ రాకెట్ గాల్లోనే పేలిపోయింది. గత ఏడాది నవంబరులో కూడా ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా చేసిన రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి. చైనా అండగా నిలుస్తుండటంతో ప్యాంగ్యాంగ్ గత ఏడాదిన్నరగా భారీగా క్షిపణి ప్రయోగాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్