కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ఎ.టి. రఘు మరణించారు. వయోభారం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న రఘు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 'మాండ్యాద గండు'తో సహా 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంబరీష్ నటించిన 27 చిత్రాలను రఘు నిర్మించి, దర్శకత్వం వహించారు. చాలా సినిమాల్లో నటించారు కూడా. దీంతో పలువురు ఆయనకు నివాళులు అర్పించారు.