ఎన్నారై వివాహాలపై న్యాయకమిషన్‌ కీలక సిఫార్సులు!

77చూసినవారు
ఎన్నారై వివాహాలపై న్యాయకమిషన్‌ కీలక సిఫార్సులు!
ఎన్ఆర్ఐ, ఓవర్సీస్ సిటిజన్స్‌ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరుగుతుండటంపై న్యాయ కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వారి వివాహాలు భారత్‌లో నమోదు చేయాలని సూచించింది. ఈ అంశాలపై రూపొందించిన ఓ నివేదికను న్యాయశాఖకు సమర్పించింది. భార్యాభర్తలిద్దరి పాస్‌పోర్ట్‌లపై వివాహ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చడానికి ‘పాస్‌పోర్ట్ చట్టం, 1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని న్యాయ కమిషన్‌ సిఫార్సు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్