తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కన్నీళ్లు పెట్టించే ఘటన జరిగింది. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన రాజమ్మ (72) అనే వృద్ధురాలు వృద్ధాప్య పింఛన్ కోసం పడరాని పాట్లు పడింది. పింఛన్ తీసుకునేందుకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న పోస్టాఫీస్‌కి శనివారం రోడ్డుపై పాకుతూ వెళ్లడం అందరినీ కలచి వేసింది. బంధువులు ఎవరూ పట్టించుకోకపోవడంతో, పింఛన్ కోసం ఇలా పాకుకుంటూ వెళ్తున్నానని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.