బెంగళూరులోని జేపీ నగర్ ఉడిపి ఉపహార రెస్టారెంట్ సమీపంలో ప్రెషర్ కుక్కర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఉగ్ర చర్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, అయితే పేలుడు తీవ్రత వల్ల ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు.