వికలాంగులు రైల్వేపాసుల కోసం స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పాసు పొందటానికి రైల్వే శాఖ వెబ్‌సైట్ ప్రారంభించింది. http:///divyangjanid.indianrail.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులోనే యూడీఐడీ మంజూరు చేస్తారు. నూతన పాసులు కావలసిన వారు, పాత పాసులు రెన్యువల్ కోసం కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగుల ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే పాసులను తీసుకోవచ్చు.