ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ

79చూసినవారు
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18 తీసుకొచ్చినట్లు తెలిపారు. 60 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని అన్నారు. బీసీ కులగణన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్