TG: రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో భార్యను చంపి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. తన భార్య(వెంకటమాధవి)ను తానే చంపినట్లు భర్త (గురుమూర్తి) పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే ఈ కేసులో డెడ్ బాడీ లభ్యం కాకుంటే గురుమూర్తిపై కేసు నిలబడదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మృతదేహం దొరక్కపోతే ఏమీ చేయాలనే దానిపై పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు.