బిహార్‌లోని బెతియా జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రజనీకాంత్ ప్రవీణ్ అనే విద్యాశాఖ అధికారి ఇంట్లో నమ్మదగిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారి ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు సైతం షాకయ్యారు. ఇప్పటి వరకు లెక్కించిన దాని ప్రకారం రూ.500, రూ.200 నోట్లే రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.