విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపై ఎక్కాడు!

7143చూసినవారు
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపై ఎక్కాడు!
ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపై ఎక్కాడు. ఈ ఘటన మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఏరో మెక్సికోకు చెందిన ఏఎమ్ 672 విమానం గ్వాటమాలకు బయలుదేరాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యమైంది. దాంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపైకి ఎక్కేశాడు. దాంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్