పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అయితే, మరోసారి ‘జయ అమితాబ్ బచ్చన్’ పేరు రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభలో ‘జయా అమితాబ్ బచ్చన్’ అని సంబోధించారు. దీనిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చైర్మన్ తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు చైర్మన్ తీరుకు నిరసనగా సోనియా గాంధీ సహా విపక్ష కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.