ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 77 రాళ్లు

64చూసినవారు
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 77 రాళ్లు
ఓ మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటుచేసుకుంది. ఓ మహిళ పాలకొల్లు జనతా ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం సంప్రదించగా.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి, 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్