బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్. బాలీవుడ్ యువ నటులు లక్ష్ లాల్వానీ, తాన్య మనక్తిలా, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.