తెలంగాణ శాసనసభ సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి తగిలిందో ఏం తగిలిందో తెలియదు కానీ.. 61 గ్రామాలు పోయి అన్నీ మున్సిపాలిటీలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సేమ్ రిజర్వేషన్ ఉంచాలని ప్రభుత్వాని కోరారు. 'దయచేసి మమ్మల్ని GHMCలో కలపొద్దు శ్రీధర్ అన్నా' అని మల్లారెడ్డి వేడుకున్నారు.