కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గౌబా నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యునిగా నియమించబడ్డారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గౌబా జార్ఖండ్ కు చెందిన 1982 ఐఏఎస్ అధికారి. ఈయన 2019-2024 వరకు క్యాబినెట్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా నీతి ఆయోగ్ మెంబర్‌గా నియమితలయ్యారు.