SRH బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థి LSG జట్టుకు వణుకు పుట్టించింది. తొలి మ్యాచులో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్ ప్రతి ఒక్కరూ దంచడంతో 286 పరుగుల భారీ స్కోరుతో హోరెత్తించింది. వరుసగా అయిదుగురు విధ్వంసకర బ్యాటర్లను ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు ప్రత్యర్థి జట్ల ముందున్న సవాల్. కెప్టెన్ కమిన్స్, షమి, హర్షల్ పటేల్‌కు సిమర్ జీత్ సింగ్ పేస్ దళంతో పాటు, జంపా, అభిషేక్ స్పిన్‌తో రాణిస్తున్నారు.