పల్నాడు జిల్లాలోని అచ్చంపేట ఎంపీపీగా మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయి ఎన్నికయ్యారు. ఎంపీపీ ఎన్నికకు మొత్తం 10 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. అందులో 9 మంది స్వర్ణమ్మబాయికి మద్దతు ప్రకటించడంతో ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికతో అచ్చంపేట ఎంపీపీ పదవిని తెదేపా కైవసం చేసుకుంది.