త్వరలో ఐపీఎల్-2025 మొదలవనున్న నేపథ్యంలో తమ జట్టు మెంటార్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను నియమిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం DC సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఢిల్లీ హెడ్ కోచ్ హేమంగ్ బాదానీతో కలిసి పీటర్సన్ పనిచేయనున్నాడని తెలిపింది. ఐపీఎల్‌లో కెవిన్ మెంటార్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. IPLలో 2012- 2014 మధ్య కెవిన్ ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవరించాడు.