AP: ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందాలని సూచించారు. నేడు 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.