ఇక పాక్‌కు ఛాన్స్‌ లేనట్లే: శ్రీశాంత్‌

78చూసినవారు
ఇక పాక్‌కు ఛాన్స్‌ లేనట్లే: శ్రీశాంత్‌
T20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన పాక్‌ ‘సూపర్- 8’ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీనిపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌ స్పందించారు. ‘‘పాకిస్థాన్‌ సూపర్‌-8కి చేరుకోవడం ఆ జట్టు అదృష్టంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకెళ్లడం దాదాపు అసాధ్యమే. పాక్ జట్టులో మొత్తం వ్యవస్థనే మార్చాలి. కనీసం వచ్చే ఎడిషన్‌లోనైనా నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటారని ఆశిద్దాం’’అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్