హైదరాబాద్ చింతల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. కింద పడిన యాసిడ్‌ను సిబ్బంది శుభ్రం చేయడం ఆలస్యం కావడంతో.. యాసిడ్ ఘాటు భరించలేక అస్వస్థతతో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. అయితే ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.