తెలుగు రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్‌లో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 'బి' కేంద్రంలో 10వ తరగతి గణితం పేపర్ వాట్సప్‌లో లీకైంది. ఈ కేసులో వాటర్ బాయ్‌పై కేసు నమోదు చేశారు. పేపర్ లీకేజ్‌లతో తమ భవితవ్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.