AP: మైనర్ బాలికపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బాలికకు తెలంగాణకు చెందిన పాస్టర్ వేముల కిరణ్ వరుసకు మేనమామ అవుతాడు. కొండపల్లికి వచ్చిన కిరణ్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.