ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన తిరుమల కొండపైకి నడకమార్గంలో చేరుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వెన్నునొప్పితో కూడా బాధపడ్డారు. ఆయనకు తిరుమలలోని అతిథి గృహంలోనే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం వారాహి సభ జరుగనుంది. తీవ్ర జ్వరంలోనూ ఆయన సభకు హాజరవుతారు.