ఏపీ రాష్ట్ర బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇదని అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు జరిపారని పవన్ తెలిపారు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందని ఆయన స్పష్టం చేశారు.