AP: కడపకు చెందిన వెంకటేష్ అనే యువకుడి సోదరి SLE అనే అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. అయితే వైద్యానికి సరిపడా డబ్బులు లేక సహాయం కోసం యువకుడు టెడ్డీబేర్ వేషంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని ప్రదర్శన చేస్తున్నాడు. సమయం చాలా తక్కువగా ఉందని, తమను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకొని.. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న తన అక్కని బతికించి.. ఐఏఎస్ అవ్వాలన్న తన ఆశయాన్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశాడు.